SKLM: గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీసీలో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు.