విశాఖలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సేవలను ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశంసించారు. మంగళవారం ఆయనను దుశ్సాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 20 నెలల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.