పుచ్చకాయపై చిటికెడు ఉప్పు చల్లడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పులోని క్లోరైడ్ అయాన్లు పండులోని తీపిని ఉత్తేజపరుస్తాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసి, హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, ఉప్పు అతిగా కాకుండా కేవలం చిటికెడు మాత్రమే వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.