PPM: గుమ్మలక్ష్మీపురంలో హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పెట్రోల్ బంక్ సిబ్బంది నీటితో మంటలను ఆర్పీ ప్రమాదాన్ని నివారించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.