విశాఖ జీఆర్పీ లైన్స్ సీఐ ఏ. రవికుమార్ మంగళవారం విజయనగరం జీఆర్పీ పోలీసు స్టేషన్ను సందర్శించారు. ముందుగా సిబ్బంది యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో నమోదు అవుతున్న రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తూ, రాత్రి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.