VSP: ఏపీ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు సాధించడం గర్వకారణమని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు ప్రథమ, ఒక ద్వితీయ, రెండు తృతీయ బహుమతులు దక్కడం శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ‘రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్’, ‘జల్ సంచయ్-జన్ భాగీదారి’ విభాగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.