కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రశిక్షణా కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు, చాట్రాతి రాంబాబు, గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు విశేష కృషి చేయాలని సూచించారు.