WNP: గోపాల్పేట మండల కేంద్రంలో శుక్రవారం శ్రీరామనవమి, దేవాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రామాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్సై జగన్మోహన్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చే ముఖ్య అతిథులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరారు.