VKB: బషీరాబాద్ మండల బాడ్లపూర్ తండా ఒకటో వార్డులో రోడ్డుపై మురుగునీరు పారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారులు, వృద్ధులు, వాహనదారులు ఆ రహదారి గుండా నడవలేకపోతున్నారు. పంచాయతీ సిబ్బందికి చాలా సార్లు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.