KMR: హనుమాన్ జయంతిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో శోభాయాత్ర మార్గాన్ని, ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.