AP: వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ పార్టీ నేతలకు సూచించారు. అక్కడి నుంచి వచ్చిన అవకాశవాదులు పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదన్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెవెన్యూ వివాదాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సూచించారు. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీని త్వరగా పూర్తి చేయాలన్నారు.