NRPT: నారాయణపేటలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా పూర్తయ్యాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దామోదర్ గౌడ్ వరుసగా ఆరోసారి విజయం సాధించారు. రాజేశ్వర్ గౌడ్ ప్యానల్‌పై దామోదర్ ప్యానల్ ఆధిపత్యం చాటుకుంది. ఉపాధ్యక్షుడిగా నందు నామాజీ, జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా అమీరుద్దీన్ ఎన్నికయ్యారు.