నిర్మల్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో జరుగనున్న 10వ తరగతి మూల్యాంకన శిబిరానికి నియమితులైన ఉపాధ్యాయులు బుధవారం ఉదయం 9 గంటలకు స్పాట్ క్యాంపులో హాజరై రిపోర్ట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. ఈ విధుల నుంచి ఎవరికి మినహాయింపు లేదని, గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.