WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని RTC డిపోలో మహాలక్ష్మీ పథకం విజయవంతమైన సందర్భంగా మహిళా సాధికారత సంబరాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA దొంతి హాజరై, మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. RTC కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.