AP: టీడీపీ ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధానిగా కేంద్రం చట్టం చేస్తోంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత పాలకులు రాజధానితో మూడు ముక్కలాటాడారు. అమరావతిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలి. రేపటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్. రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది’ అని విమర్శించారు.