TPT: కోట మండల కేంద్రంలోని కోట క్రాస్ రోడ్డులో వే బ్రిడ్జి వద్ద లారీల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. వే బ్రిడ్జికి వచ్చే లారీలు డ్రైవర్లు రోడ్డుపైనే అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.