NGKL: అమ్రాబాద్ మండలం తెలుగుపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ) రూ.54.50 లక్షలతో నూతనగా నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదరికం వల్ల ఏ ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేజీబీవీలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.