AP: తెలుగుదేశం పార్టీ ఓ వ్యక్తికి, ఓ వర్గానికి, ఓ ప్రాంతానికి చెందని పార్టీ కాదని.. ఇది అందరి పార్టీ అని CM చంద్రబాబు అన్నారు. ఇది ప్రతి ఒక్కరి భవిష్యత్ కోసం, బాగోగుల కోసం పనిచేసే పార్టీ అని తెలిపారు. పార్టీ పదవుల్లో, చట్టసభల్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. మగవారితో సమానంగా ఆడబిడ్డలను గుర్తించిన పార్టీ తమ TDP అని పేర్కొన్నారు.