మంచిర్యాల 19వ డివిజన్ పరిధిలో వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టామని కార్పొరేటర్ వరలక్ష్మి తెలిపారు. పాత మంచిర్యాల ఎస్సీ కాలనీ ఏరియాలో చెడిపోయిన బోరు బావులకు దగ్గరుండి మరమ్మతులు చేయించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మేయర్ మధుకర్ సహకారంతో డివిజన్లోని నీటి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.