MBNR: మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ పంచాయతీలో తై బజార్ సంత వార్షిక వేలం పాట మంగళవారం సాగింది. సర్పంచ్ సుంకిరెడ్డి గాయత్రీ దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో గ్రామస్థులు పోటాపోటీగా బిడ్లు వేశారు. భారీ పోటీ మధ్య డి. వెంకటేష్ అత్యధికంగా రూ. 33,500 పాడుకుని సంత హక్కులను దక్కించుకున్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి పనులకే వినియోగిస్తామని కార్యదర్శి స్పష్టం చేశారు.