SS: పరిగి మండలం హోన్నంపల్లి గ్రామానికి చెందిన కేశవరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబానికి మంత్రి సవిత మంగళవారం రూ.5 లక్షల ప్రమాద బీమా సాయం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. బీమా పథకం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టినదని, ఇది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని మంత్రి తెలిపారు.