JN: జాఫర్ఘడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను BJP మండల అధ్యక్షుడు అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ సందర్శించారు. క్వింటాల్ మొక్కజొన్నను రూ. 2,400 ధరకు కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. అధికారులు దళారులకు రక్షణగా మారారని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.