VKB: మున్సిపాలిటీలోని ప్రతి వార్డు సమస్యను పరిష్కరించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన పురపాలక సంఘ వార్షిక బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కౌన్సిలర్లు తమ వార్డులలో లేవనెత్తిన సమస్యలను వ్యక్తిగతంగా నోట్ చేసుకున్నానని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.