ASF: కాగజ్ నగర్ మున్సిపల్ పరిధి బట్టుపల్లి చౌరస్తాకు మాజీ MLA, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత కావేటి సమ్మయ్య పేరును ఖరారు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఆమోదించింది. మంగళవారం కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టణ అభివృద్ధికి, తెలంగాణ మలిదశ ఉద్యమానికి సమ్మయ్య చేసిన విశేష సేవలను గుర్తిస్తూ గౌరవార్థం ఈ నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.