NLG: నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన చిర్రబోయిన నరేష్ అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు సర్పంచ్, పాలక మండలి సభ్యులు, గ్రామస్థులు కలిసి బాధిత కుటుంబానికి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.