NGKL: వేసవిలో అంబలి శరీరానికి శక్తినిచ్చే ఉత్తమ పోషకాహారమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేటలో రక్షిత మహిళా సొసైటీ ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎండల నేపథ్యంలో ప్రజలు, పేదలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఇక్కడ ఉచితంగా అంబలి పంపిణీ చేయనున్నారు.