NZB: జిల్లాలో ఏప్రిల్ 2న వైన్ షాపులు బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కమిషనర్ పీ.సాయి చైతన్య ఆదేశించారు. ఏప్రిల్ 2 ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 3 ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.