BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆర్. మురళీధర్ రావు ఆత్మీయ వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, మాట్లాడుతూ.. మురళీధర్ రావు సిన్సియర్, బాధ్యతావంతమైన అధికారి అని అన్నారు. విధుల పట్ల ఆయన చూపిన నిబద్ధత ఇతర ఉద్యోగులకు ఆదర్శం అని కొనియాడారు.