NGKL: ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో జరిగిన ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజేందర్, మల్లేశ్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.