TG: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లిలోని ఓ ఆసుపత్రిలో మృత శిశువు కలకలం రేపింది. వాష్‌రూమ్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మగబిడ్డకు జన్మనిచ్చిన ఓ గర్భిణీ.. ఫ్లష్ ట్యాంక్‌లో పసికందును పడేసింది. ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.