NRML: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ అక్క(నారిశక్తి) కార్యక్రమానికి స్కోచ్ అవార్డు లభించిన సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం పోలీస్ అక్కలతో కలిసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి శాలువాలతో సత్కారం చేసి అభినందించారు. మహిళల భద్రత, అవగాహన పెంపులో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు.