TPT: పిచ్చాటూరు మండలం అప్పంబట్టు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో దిగేందుకు ప్రయత్నించగా, కొందరు కిందపడడంతో స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.