SDPT: దుబ్బాక పట్టణంలోని ఐటీఐ కాలేజీ పరిసరాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఐటీఐ కాలేజీకి రాకపోకలు సులభతరం కావడానికి రోడ్ల అభివృద్ధి కీలకమని తెలిపారు.