BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన Arrive-Alive లో భాగంగా మంగళవారం పాల్వంచ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ప్రజా రవాణా, వస్తురవాణా చేసే డ్రైవర్లు సుమారు 200కు పైగా డ్రైవర్లు పాల్గొన్నారు.