చిత్తూరు జిల్లా శక్తి టీం పోలీసులు ఆర్.కె జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం,హెల్ప్‌లైన్ నంబర్లు, శక్తి యాప్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహాలు చట్టవిరుద్ధమని, పిల్లలపై లైంగిక వేధింపులకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112,1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలన్నారు.