SRPT: నడిగూడెం మండలం ఎక్లాట్ఫాన్ పేట తండాలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విద్యుత్ అధికారులు పర్యటించారు. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించి ఎత్తుకు మారుస్తామని, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ వరలక్ష్మి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.