SRD: ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని సిర్గాపూర్ సర్పంచ్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక జీపీ లో గ్రామసభ నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సభలో చర్చించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. గ్రామాభివృద్ధి అవసరాలపై గుర్తించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నవీన్ రెడ్డి హౌసింగ్ AE ఇందు నాయుడు ఉన్నారు.