VZM: వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఎల్నీనో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, దాని ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్కువ పెట్టుబడి గల ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంపై 3రోజుల జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.