NLR: కందుకూరు పట్టణంలోని కుసుమ ఎలక్ట్రానిక్స్ వద్ద 34 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గురువారం దాడులు నిర్వహించిన ఒంగోలు విజిలెన్స్ బృందం సిలిండర్లను స్వాధీనం చేసుకుని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.