E.G: ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో గురువారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ శాఖ ఉద్యోగులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ వై.మేఘా స్వరూప్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.