CTR: జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పత్రాలు, హెల్మెట్, డ్రంక్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్రమ రవాణా, నేరాలను అరికట్టేందుకు అనుమానాస్పద వాహనాలను పరిశీలిస్తున్నారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడమే లక్ష్యమని పోలీసులు తెలిపారు.