CTR: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చిత్తూరులో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. గాంధీ విగ్రహం కూడలి వద్ద పూలతో రంగవళ్లు వేసి “మన అమరావతి – మన రాజధాని” అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి, దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.