ప్రకాశం: పాత సింగరాయకొండలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు యోగానంద లక్ష్మీనరసింహస్వామి (తాతస్వామి) వారికి వైభవంగా పంచామృతాభిషేకం, తిరుప్పావడ సేవజరగనున్నాయి. ఈ సేవలలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.