పశ్చిమాసియా యుద్ధం మందుబాబులపై తీవ్ర ప్రభావం చూపనుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా తగ్గి, మద్యం బాటిళ్ల తయారీ ఖర్చు పెరిగింది. ముఖ్యంగా బీర్ ప్యాకేజింగ్ ఖర్చు 40 శాతం వరకు ఉండటంతో, గాజు బాటిళ్ల ధరలు 20 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ వేసవిలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. గ్యాస్ కొరత నేరుగా లిక్కర్ ధరలపై పడటంతో మందుబాబుల జేబుకు చిల్లు పడటం ఖాయం అనిపిస్తోంది.