AP: మూలపేట పోర్టు పనుల్లో తమ ప్రభుత్వం వేగాన్ని పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మే 2024తో పోలిస్తే మార్చి 2026 నాటికి భారీ ప్రగతి సాధించామన్నారు. దక్షిణ బ్రేక్ వాటర్ వద్ద 26.20 లక్షల టన్నుల రాక్ ప్లేసింగ్, ఉత్తర బ్రేక్ వాటర్ పనులను 100శాతం పూర్తి చేశామని గణాంకాలతో వివరించారు. YCP ఆలస్యం చేస్తే, తాము రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.