RR: చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ వీరయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రేరణగా నిలిచిన మహానుభావుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.