SS: రొద్దంలోని కేజీబీవీ పాఠశాలను మంత్రి సవిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, వసతి సౌకర్యాలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.