KMR: కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ కారణంగా జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్నిసేవలు నిలిచిపోనున్నాయి. మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో, తిరిగి సోమవారం ఉదయం అందుబాటులోకి రానున్నాయి.