CSKతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోవడంతో, చివరి 2 ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం 4 ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు. తొలి మ్యాచ్లో రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్న శ్రేయస్, ఇప్పుడు రూ.24 లక్షల భారీ జరిమానా పడనుంది. అలాగే, జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.6 లక్షల చొప్పున జరిమానా విధించనున్నారు.