TG: BRS గురించి చెప్పాల్సింది ఏమీ లేదని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత వేరుకుంపటితో BRS రోడ్డున పడిందన్నారు. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటేనని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని చెప్పారు.